Tuesday, June 9, 2026
Homeసినిమానా ‘శేఖర్’ సినిమా జోలికి వస్తే సహించేది లేదు : నిర్మాత బీరం 

నా ‘శేఖర్’ సినిమా జోలికి వస్తే సహించేది లేదు : నిర్మాత బీరం 

Don’t disturb: రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో రూపొందించిన చిత్రం శేఖర్.  ఈ సినిమా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ఈ చిత్రం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి అన్నారు.

ఈ సంద‌ర్భంగా  ఆయన మాట్లాడుతూ… ” నేను శేఖర్ చిత్రాన్ని నిర్మించాను. జీవితా రాజశేఖర్ గారు మా చిత్రానికి దర్శకత్వం వహించారు.  రాజశేఖర్ గారు కథానాయకుడిగా నటించారు. వాళ్లిద్దరి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే… ఏదైనా జరిగితే… నేను పరువు నష్టం దావా కేసు వేస్తాను. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతాను. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే… అసలు నిర్మాతను నేను” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular