Wednesday, April 17, 2024
Homeసినిమా‘లవ్ స్టోరి’ కి ఆ రెండు పాయింట్స్ కీలకం : శేఖర్ కమ్ముల

‘లవ్ స్టోరి’ కి ఆ రెండు పాయింట్స్ కీలకం : శేఖర్ కమ్ముల

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘లవ్ స్టోరీ’.  దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సెప్టెంబర్ 24 న రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడుతూ…

లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యాజిక్ అన్నీ కూడా ఉంటాయి వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని మరో స్థాయిలో పెట్టేలా ఉంటుంది అదే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా ఉంటుంది”

“ఈ సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి కుల వివక్షత…. ఇంకొకటి ఆడ, మగ తారతమ్యం….  ఈ రెండు విషయాల గురించి సినిమాలో బలంగా వివరించాం. ‘లీడర్’లో అవినీతిపై చేద్దాం అనుకున్నాను అందులో కులం కోసం పెట్టిన సీన్ చిన్న పార్ట్ వరకు మాత్రమే కానీ దాని పైనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చేద్దామని ఎప్పుడు నుంచో ఉంది. సమాజంలో ఎప్పుడూ ఏదొక సమస్య ఉంటూనే ఉంటుంది. అలా చూసి చూసి ఫైనల్ గా రెండు బలమైన పాయింట్స్ తో ‘లవ్ స్టోరీ’ రూపొందించాం

“లాక్ డౌన్ వచ్చే టైమ్ కి ఇంకా జస్ట్ కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది, కంప్లీట్ చెయ్యడానికి టైం కోసం చూస్తున్నాం. ఆ గ్యాప్ లో ఎడిటింగ్ కంప్లీట్ చెయ్యాలి అనుకున్నాం, అది కూడా పూర్తిగా ఆ టైమ్ లో చేయలేకపోయాం. తర్వాత మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇండస్ట్రీలో ఫస్ట్ షూట్ కూడా మేమే స్టార్ట్ చేసాం. అలా కొన్నాళ్ళు చేసి రిలీజ్ చేద్దామన్న టైమ్ లో రెండో వేవ్ వచ్చేసింది. నిజానికి ఆ టైమ్ లో అయితే వేరే నిర్మాతలు ఖచ్చితంగా సినిమా ఓటిటికి ఇచ్చేసేవాళ్ళు కానీ.. మా నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఉన్నారు. వారికి కూడా థియేటర్స్ ఉన్నాయని కాదు, వారికి తెలుసు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాల్సింది అని అందుకే ఇన్నాళ్లు ఆగారు

“నిజంగా వారు దొరకడం నాకు ఇంకా బలం వచ్చినట్టు అయ్యింది. ఈ గ్యాప్ లోనే చాలా అనుమానాలు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మేము చెయ్యాలా వద్దా అని సందేహాలు నేను తీసుకున్న పాయింట్స్ కూడా మామూలువి కాదు అందరినీ మెప్పించాలి అనేది ఒకటి….ఇలా ఎన్నో అనిపించాయి. ఇక ఫైనల్ ఈ సెప్టెంబర్ 24 కి ఈ సినిమాని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. చిరంజీవి గారు, ఆమీర్ ఖాన్ గారు ఈవెంట్ కు అటెండ్ అయి ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్లకు స్పెషల్ థాంక్స్. నాగచైతన్యను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం… సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతీ అంశంలో కూడా డబ్బింగ్ లో ప్రతి పదం సినిమా షూట్ లో కూడా నా టీం అంతటితో చాలా వర్క్ చేశాం, తెలంగాణా స్లాంగ్ లో చైతూని ముందు సినిమాల్లో చూపించని విధంగా ట్రై చేశాము,  ఖచ్చితంగా చాలా నమ్మకంగా చెప్తున్నాం. ఈ సినిమాలో చాలా కొత్త నాగ చైతన్యని అందరూ చూస్తారు. అంతే కాదు అతని తల్లిగా ఈశ్వరి రావు చాలా బాగా నటించారు. తనకు ఫోన్ లో క్యారెక్టర్ గురించి చెప్పి నెక్స్ట్ డే ఆడిషన్స్ కోసం పిలిస్తే.. 80 రూపాయల చీర కట్టుకొని అదే క్యారెక్టర్ లో వచ్చింది. అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. అలా అందరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు”

“సాయి పల్లవిని మళ్లీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే… ఆమె ఒక మంచి పెర్ఫామర్. అంతే ..అంతకు మించి ఏం లేదు. చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ‘ఫిదా’ నుంచి ట్రావెల్ అయ్యాం. కాబట్టి తన గురించి బాగా తెలుసు. అందుకే ఈ సినిమాకి తీసుకున్నాం. ‘ఫిదా’లో అయితే తన రోల్ ఒకలా ఉంటుంది కానీ ఈ సినిమాలో కంప్లీట్ దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. తనలో తాను మదనపడుతూ స్ట్రగుల్ అవుతూ ఉండేలా కనిపిస్తుంది. చాలా షేడ్స్ ఉన్న రోల్. తను చాలా కష్టపడి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ను తీసుకోవడానికి కారణం ఆయన రెహమాన్ దగ్గర వర్క్ చేశాడని కాదు, కానీ పవన్ ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తాడు అని అనిపించింది.  అందులోనూ లోకల్ అబ్బాయి కావడంతో నమ్మకం ఉంది కానీ తాను మాత్రం నేను పెట్టుకున్న అంచనాలకి మించే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ప్యాండమిక్ టైం లో ఏదన్నా మంచి మాకు జరిగింది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ హిట్టవడమే అని చెప్పాలి. తాను మాత్రం సూపర్ జాబ్ ఇచ్చాడు. ఖచ్చితంగా అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. నా ఇది వరకటి సినిమాల్లో లాగే ఈ సినిమా కూడా వాటి లానే మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఓ పాయింట్ ఉంటుంది. అంటే ఓ కష్టం ఉంటుంది అది డెఫినెట్ గా ప్రతీ ఒక్కరికీ తలిగేలా ఉంటుంది, అది ఉన్న వాళ్ళు అయితే.. మాత్రం ఈ సినిమాని వదిలిపెట్టరు”

“నేనే కాదు ఎవరైనా సరే తమ సినిమాలు చరిత్రలో నిలిచేలా ఉండాలనే తీస్తారు. ఇందులో కూడా ఆ షేడ్స్ ఉన్నాయి. కొన్ని అంచనాలు ప్రతీ ఒక్కరు పెట్టుకుంటారు మొన్న నాగార్జున గారు ‘ప్రేమ్ నగర్’ సినిమా రిలీజ్ రోజున ఇది కూడా అవుతుంది అని పెట్టారు. ఆ సినిమా సక్సెస్ లో నా సినిమా ఒక 30 పర్సెంట్ అందుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను తీసిన ‘లీడర్’ సినిమా అప్పుడు అందరూ మామూలుగానే చూశారు కానీ ఇప్పుడు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటారు, అలానే నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తా. ఒక పదేళ్లు తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటాను

లీడర్ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే తోనే నడిచే విధంగా సీక్వెల్ ని చేస్తాను. తర్వాతి సినిమా ధనుష్ తో చేస్తున్నా. తమిళ్, తెలుగు ముందు అనుకున్నాం, ఇక ఎలాగో ఓటిటితో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. పైగా ధనుష్ కి కూడా హిందీలో రీసెంట్ గా మంచి మార్కెట్ వచ్చింది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్ లో ఉంటుంది, పైగా కథ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అందుకే మల్టీ లాంగ్వెజెస్ సినిమాలా ప్లాన్ చేశాం”  అంటూ లవ్ స్టోరి తో పాటు భవిష్యత్ ప్రాజెక్టులపై అనేక విషయాలు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్