Tuesday, March 10, 2026
Homeస్పోర్ట్స్BWF World Championships: సింధు ఔట్- ప్రణయ్, సేన్ ముందంజ

BWF World Championships: సింధు ఔట్- ప్రణయ్, సేన్ ముందంజ

డెన్మార్క్ లో  జరుగుతోన్న బిడబ్ల్యూ ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పివి సింధు తొలి రౌండ్ లోనే ఓటమి పాలై నిష్క్రమించింది. గత కొద్ది రోజులుగా పేలవమైన ఫామ్ ప్రదర్శిస్తోన్న సింధు నేడు కూడా ఏమాత్రం ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. జపాన్ ప్లేయర్ జోజోమి ఒకుహోర చేతిలో 21-14; 21-14 తేడాతో ఓడిపోయింది,

పురుషుల సింగిల్స్ లో భారత స్టార్లు లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ లు విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ లో అడుగు పెట్టారు,

సేన్ 21-21; 21-11 తో కొరియా ఆటగాడు జియాన్ హేయెక్ ను ఓడించాడు.  మరో మ్యాచ్ లో ప్రణయ్ 21-9; 21-14 తేడాతో ఇండోనేషియా ఆటగాడు చియో ఔరాపై గెలుపొందాడు.

మిక్స్క్ష డబుల్స్ లో వెంకట గౌరవ ప్రసాద్- జూహీ దేవాంగన్;  మహిళల డబుల్స్ లో శిఖా గౌతమ్- అశ్విని భట్ జోడీలు కూడా ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular