Sunday, June 7, 2026
Homeసినిమాసిఎం జగన్ కు కైకాల కృతజ్ఞతాపూర్వక లేఖ!

సిఎం జగన్ కు కైకాల కృతజ్ఞతాపూర్వక లేఖ!

I am deeply moved: సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యక్తిగతంగా ఫోన్ చేసి సమాచారం కనుక్కొని అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇవ్వడం తననెంతో కదిలించిందని కైకాల భావోద్వేగం వ్యక్తం చేశారు.  హామీ ఇచ్చినట్లుగానే అధికారులు వ్యక్తిగతంగా వచ్చి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి వైద్య ఖర్చులకు ఆర్ధిక సహాయం అందించారని కైకాల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు కైకాల సిఎం జగన్ కు లేఖ రాశారు. కష్ట కాలంలో ఉన్నప్పుడు మీరు చూపిన ఔదార్యం తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు.

‘నా విషయంలో మీరు చూపిన చొరవ నటుల పట్ల, వారి యోగక్షేమాల పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంద’ని కైకాల లేఖలో పేర్కొన్నారు. ప్రజల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధతో రాష్ట్రం ఓ మంచి వ్యక్తి చేతులో ఉందనే భరోసా ఇస్తుందన్నారు కైకాల. మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్దిలాలని లేఖలో ఆకాంక్షించారు. తాను సంతకం పెట్టే స్థితిలో లేకపోవడంతో ఈ కృతజ్ఞతా లేఖపై తన బదులు తన కుమారుడు చేస్తున్నాడని కైకాల వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular