Tuesday, June 9, 2026
Homeసినిమా‘చోర్ బజార్’లో ఆనాటి అర్చన

‘చోర్ బజార్’లో ఆనాటి అర్చన

Archana is back:  ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకం పై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా హైలైట్స్ రివీల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నిన్నటి తరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమనటి అర్చన కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం తెలియ‌జేసింది.

ఇంగ్లీష్, బెంగాళీ సహా అన్ని ప్రధాన భారతీయ భాషా చిత్రాల్లో కెరీర్ సాగించింది అర్చన. వీడు చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కించుకుంది. తెలుగులో ఆమె నటించిన నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. చోర్ బజార్ చిత్రంతో 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెర పైకి వస్తోంది అర్చన. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular