Sunday, June 7, 2026
Homeసినిమాసీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

Balayya died: సుప్రసిద్ధ క్యారెక్టర్ నటుడు బాలయ్య ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో అయన తుదిశ్వాస విడిచారు.

ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడిగా రంగప్రవేశం చేసిన అయన నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు.

ఆయన అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా నిర్మించిన చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము – శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో)  లాంటి చిత్రాలు అఖండ విజయం సాధించాయి.  దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

పెద్దరికం తరహా పాత్రల పోషణలో బాలయ్య ఎంతో గుర్తింపు పొందారు. రేవతి ప్రధాన పాత్రలో నటించిన ‘అంకురం’ సినిమాలో ఆమె తండ్రిగా బాలయ్య నటించారు. ఈ తరం ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుంది పోయే పాత్ర ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular