Saturday, March 14, 2026
HomeTrending Newsబండి సంజయ్ తెరాస ప్రభుత్వ తొత్తు – పొన్నం

బండి సంజయ్ తెరాస ప్రభుత్వ తొత్తు – పొన్నం

ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం ఏంటి? లక్ష్యం ఏంటి అని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోవడానికే బండి సంజయ్ పాదయాత్ర ఉపయోగపడుతుందని పొన్నం ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం అంటున్న బిజెపి నేతల మాటలు మిలియన్ జోక్ గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత అది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెరాస బిజెపి ల మధ్య ఢిల్లీలో దోస్తు, గల్లీలో లొల్లి అర్థం ఏంటి అన్నారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర సెల్ఫీ లకె పరిమితం అయిందని, దేవాలయల అబివృద్దికి, పార్లమెంట్ అభివృద్ధి కి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బండి సంజయ్ ఎం చేశావు, ఎన్ని మీటింగ్ లకు వచ్చావని పొన్నం ప్రశ్నించారు.

ఎన్నికలు జరిగి రెండు ఏళ్ళు గడిచింది ఇప్పటివరకు ఎం అభివృద్ధి చేశావని, మీ పాదయాత్ర వల్ల ఏమైనా మెడికల్ కాలేజీలు, నోవోదయ పాఠశాలలు వచ్చాయ అన్నారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు కరీంనగర్ నియోజకవర్గానికి ఎం నిధులు తెచ్చారు.?, పత్రికల వార్తలకు తప్ప మీ మాటలు దేనికి ఉపయోగ పడవని విమర్శించారు.

కెసిఆర్ ను జైళ్ల పెట్టిస్తా అని బండి సంజయ్ అంటారు, ఆయన మాటల్ని వాళ్ళ కేంద్ర నాయకులే పట్టించుకోవడం లేదని పొన్నం ప్రభాకర్ అపహాస్యం చేశారు. బిజెపి పార్టీకి అందరితో చెడింది ఇక మిగిలింది కేవలం ఢిల్లీ దోస్తు కేసీఆర్ మాత్రమే అన్నారు. కరోనా, వరదలు, ప్రజల సమస్యల పై బండి సంజయ్ ఎందుకు  మాట్లాడటం లేదన్నారు. బండి సంజయ్ తెరాస ప్రభుత్వ తొత్తు కాకపోతే కేంద్రం నుండి సీఎం కేసీఆర్ పై విచారణ చేయించాలని..నేటి ప్రజా సంగ్రమ  యాత్రలో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular