Saturday, July 27, 2024
HomeTrending Newsచైనాకు వ్యతిరేకంగా నిరసనలు

చైనాకు వ్యతిరేకంగా నిరసనలు

చైనా జాతీయ దినోవత్సం నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో టిబెటన్లు, వుయ్ఘర్లు,హాంకాంగ్  పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. లండన్లో మూడు వర్గాలకు చెందిన వేల మంది ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. ఫ్రాంక్ఫర్ట్, న్యూయార్క్, టొరంటో, సిడ్నీ నగరాల్లో పెద్దసంఖ్యలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

కమ్యూనిజం ముసుగులో చైనాలో మానవ హక్కుల హననం జరుగుతోందని ఆందోళనకారులు విమర్శించారు. టిబెట్ ఆక్రమించిన చైనా బౌద్ధ మత అణచివేత, టిబెటన్ల సంస్కృతి దెబ్బతీసేలా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తోందని, టిబెటన్లకు ఉపాధి కల్పించకుండా, వనరులు మాత్రం కొల్లగొడుతోందని నిరసనకారులు ఆరోపించారు.

తూర్పు తుర్కిస్తాన్ ఆక్రమించిన చైనా వుయ్ఘర్లను బానిసలుగా చూస్తోంది. ఆరోగ్య పరిరక్షణ పేరుతో జనాభా నియంత్రణ టీకాలు ఇస్తోంది. ప్రజలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు చేసుకోవటం జిన్జియాంగ్ ప్రావిన్సులో నిషేధం. గనుల్లో వుయ్ఘర్లను బానిసలుగా పని చేయిస్తున్నారు.

అటు హాంకాంగ్ లో ప్రజాస్వామ్య హక్కులను చైనా పాలకులు కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు నిరసనలు చేయటం నిషేధం, ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నించే వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. విద్యార్ధి నాయకులను నిర్భంధించి, వారిని చైనా పాలకులు చిత్రహంసలకు గురిచేసి హతమారుస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్