Sunday, June 14, 2026
HomeTrending Newsసీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్ పాత్రికేయులు శ్రీ గుడిపూడి శ్రీహరి (86) సోమవారం రాత్రి 2 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. గుడిపూడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినీ విమర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వివరణాత్మక వ్యాసాలు రాసే రచయితగా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు.

ఈనాడులో 25 ఏళ్ల పాటు హరివిల్లు పేరుతో ప్రత్యేక శీర్షిక నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఇతర రంగాలలో అనేక మంది కళాకారులను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆల్ ఇండియా రేడియోలో ఎమ్‌ఎస్‌ రామారావును పరిచయం చేసారు గుడిపూడి శ్రీహరి. 1968లో ప్రముఖ దినపత్రిక హిందూ, ఈనాడులతో తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. నాటి విలువలతో కూడిన పత్రికారంగంలో తనదైన అక్షర శోభతో ఉన్నతంగా ఎదిగిన గుడిపూడి శ్రీహరిలేని లోటు పూడ్చలేనిది.

1968లో ‘హిందు’ దిన పత్రికలో కంట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆల్ ఇండియా రేడియోలో ఇరవై యేళ్ళ పాటు న్యూస్ బ్రాడ్ కాస్టర్ గా సేవలు అందించారు. ఈనాడు దిన పత్రికలో ‘హరివిల్లు’ పేరుతో పాతికేళ్ళ పాటు శీర్షిక నిర్వహించారు. సితార సినిమా వార పత్రికలో వేలాది చిత్రసమీక్షలు రాశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేశారు. బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ (దేశోద్ధారక భవన్) నిర్మాణానికి విశేష కృషి సల్పారు. ఎన్.ఎఫ్.డి.సి. స్క్రిప్ట్ కమిటీలోనూ, నంది అవార్డుల కమిటీలోనూ సభ్యులుగా ఉన్నారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా సేవలు అందించారు. హిందు దినపత్రికలో ఫ్రైడే పేజీ, సండే సెక్షన్లలో సినిమా, సాంస్కృతిక సంబంధమైన వేలాది వ్యాసాలను రాశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతిపైనా, తెలుగు సినిమా రంగంపైనా పుస్తకాలు వెలువరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular