Sunday, November 24, 2024
HomeTrending Newsకేసీఆర్ తోనే మహిళల సాధికారత - మంత్రి ఎర్రబెల్లి

కేసీఆర్ తోనే మహిళల సాధికారత – మంత్రి ఎర్రబెల్లి

మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలోని 3000 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో, డీడీసీబీ దగ్గర ప్రారంభించారు. అనంతరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ….

సీఎం కేసీఆర్ వచ్చాక మహిళలకు ఎంత ప్రాధాన్యత వచ్చింది…రాకముందు ఎలా ఉండేది. ఈరోజు అందరం సమీక్ష చేసుకోవాలి. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి 7 సార్లు గెలిచాను. చాలా మంది సీఎంలను, పార్టీలను చూసాను. కానీ సీఎం కేసీఆర్ చేసినట్లు ఎవరూ చేయలేదు. తెలంగాణ రాక ముందు మహిళలకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు వచ్చేవి. ఇపుడు 18వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం. సంగెం మండలంలో టెక్స్ టైల్ పార్క్ కు 10 వేల మంది అవసరం. కొడకండ్లలో కూడా మినీ టెక్స్ టైల్ పార్క్ వస్తుంది. వీటి వల్ల మహిళలకు ఉపాధి, ఉద్యోగం లభిస్తుంది. ఇది చెబితే సీఎం వెంటనే అనుమతి ఇచ్చారు. 3 నెలల తరవాత మరొక బ్యాచ్ మొదలు పెడుతాం. ఇది కంటిన్యూ గా జరిగే శిక్షణ కార్యక్రమం. టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగాలు ఇవ్వడానికి 35 సంవత్సరాల లోపు ఉన్న వారు కావాలి అని టెక్స్ టైల్ పార్క్ వాళ్ళు అడిగారు. అందుకే ఈసారి శిక్షణ కోసం 35 ఏళ్లలోపు మహిళలు అని నిబంధన పెట్టాము. వచ్చే బ్యాచ్ కు వయో పరిమితి, విద్య అర్హత నిబంధన తీసేయమని చెబుతున్నాను.

ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం Serp నుంచి 10వేల రూపాయలు…స్త్రీ నిధి నుంచి 7 వేల రూపాయలు చొప్పున ఒక్కొకరిపై 17వేల రూపాయల ఖర్చు చేస్తున్నాం. మొత్తం 5 కోట్లు ఖర్చు చేస్తున్నాము. మహిళలు వ్యాపార వేత్తలు కావాలి. వ్యాపారం చేయడానికి ముందుకు వస్తె హైదరాబాద్ లో నేను శిక్షణ ఇప్పిస్తాను. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వారితో ఒప్పందం పెట్టుకున్నాం. దేశంలో తెలంగాణ రాష్ట్రమే ఇలాంటి ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం. ప్రతి గ్రామంలో సమాఖ్య భవనాలు కట్టిస్తాను. అక్కడ మహిళలు అంతా కూర్చోని, సమీక్షించుకుని పని చేసేందుకు ఉపయోగ పడుతుంది.

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియ, జనగామ జిల్లా కలెక్టరు శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, పిడి డి.ఆర్. డి. ఏ శ్రీరామ్ రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, మాజీ చైర్మన్ గాంధీ నాయక్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు సావిత్రి, జ్యోతి, సర్పంచ్ ఏకాంత రావు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు పాల్గొన్నాఆదర్శంరు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్