అరుణాచల్ ప్రదేశ్‌లో మంచుచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి చెందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లో ఏడుగురు జవాన్లు ఆదివారం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, హిమపాతం కారణంగా గల్లంతయ్యారు. ఈ మేరకు సహాయక బృందాలు గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. అయితే, గల్లంతైన ఏడుగురి మృతదేహాలను ఇవాళ గుర్తించినట్లు సైనిక అధికారులు వెల్లడించారు.
చనిపోయిన జవాన్ల వివరాలు తెలియాల్సి ఉంది. దుర్ఘటన జరిగిన ప్రాంతం 14,500 ఫీట్ల ఎత్తులో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో గత వారం రోజులుగా మంచు ఏకదాటిన పడుతోంది. అరుణాచల్ సరిహద్దుల్లో శీతాకాలంలోనే చైనా నుంచి కవ్వింపు చర్యలు ఉండటం, చైనా నుంచి దొంగచాటుగా వివిధ సరుకులు స్ముగ్లర్లు భారత్ కు చేరవేస్తారు. వీటిని కట్టడి చేసేందుకు భారత సైన్యం రేయింభవళ్ళు గస్తీ కాస్తుంటారు.