Tuesday, March 19, 2024
Homeసినిమాఇప్పుడు రియాలిటీ అంటే ఇదే!

ఇప్పుడు రియాలిటీ అంటే ఇదే!

ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడవలసి వస్తే, ఆ సినిమాకి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకుని వెళ్లేవారు. ఇక కొంతమంది దర్శకులకు .. కొన్ని బ్యానర్లకు ఉన్న పేరును దృష్టిలో పెట్టుకుని కూడా ధైర్యంగా థియేటర్స్ కి వెళ్లేవారు. ఊహించని ఏ బూతు సన్నివేశం తెరపైకి ఎలాంటి పరిస్థితుల్లోను రాదనే ఒక భరోసా అందరికీ టికెట్లు తీసిన ఆ యజమానికి ఉండేది. ఇప్పుడు వారానికి మూడు సినిమాలు థియేటర్స్ కి వస్తే, ఆరు సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి.

సినిమాల సంగతి అటుంచితే, వాటితో వెబ్ సిరీస్ లు పోటీ పడుతున్నాయి. నిర్మాణ విలువల విషయంలో సినిమాలను మించి వెబ్ సిరీస్ లు ఉండటం విశేషం. వెబ్ సిరీస్ లను ఎందుకు చూడాలి? అంటే, సినిమాల మాదిరిగా వీటిని ఒక గుంజకు కట్టేసేవారు లేరు .. కట్టడి చేసేవారు కనిపించరు. బూతు సన్నివేశాలు .. బూతు సంభాషణలు వీటి ప్రధమ లక్షణంగా .. ప్రధాన లక్షణంగా మారిపోయింది. ‘ఇవేం వెబ్ సిరీస్ లండీ బాబూ’ అంటూనే చూసేవారు లేకపోలేదు.

ఇక తెలుగు వెబ్ సిరీస్ లు కూడా ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అందుకు ‘సైతాన్’ వెబ్ సిరీస్ నుంచి వదిలిన ట్రైలర్ ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డిస్నీ హాట్ స్టార్ లో జూన్ 15న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సిరీస్ సంగతి అటుంచితే ఈ ట్రైలర్ ను పిల్లలు ఎక్కడ చూస్తారోనని పేరెంట్స్ టెన్షన్ పడి చావాల్సిందే. ఇక ఈ మధ్య టాయ్ లెట్ లో కూర్చుని ఫోన్ కాల్స్ చేయడం .. తాగేసి వాంతులు చేసుకుని ఆ పక్కనే పొర్లడం .. మందు తాగకుండా మాట్లాడుకోలేకపోవడం ఇలాంటివన్నీ రియాలిటీ పేరుతో తోసుకొస్తూనే ఉన్నాయి. వినోదం వికటించడమంటే ఇదేనేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్