Friday, May 31, 2024
Homeసినిమాశుక్రవారం వస్తున్న 'కార్పొరేటర్'

శుక్రవారం వస్తున్న ‘కార్పొరేటర్’

Carporator Coming:
స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం
కార్పొరేటర్’. సంజయ్ పూనూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్ అధినేత డాక్టర్ ఎస్.వి. మాధురి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా దాదాపు 200 థియేటర్లలో నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో.. 5 పాటలు – 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు.

శంకర్ సరసన సునీత పాండే-లావణ్య శర్మ- కస్తూరి హీరోయిన్స్ గా నటించిన‌ ఈ చిత్రానికి యాక్షన్: వింగ్ చున్ అంజి, డాన్స్: సూర్యకిరణ్ – వెంకట్ దీప్, ఎడిటింగ్: శివ శర్వాణి, కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: ఎం.ఎల్.పి.రాజా, నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్