Sunday, January 19, 2025
Homeసినిమాగ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శంకర్ మహాదేవన్, వివి లక్ష్మీ నారాయణ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో శంకర్ మహాదేవన్, వివి లక్ష్మీ నారాయణ

మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే  ఆక్సిజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజ సిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్  “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు.

శంకర్ మహదేవన్ మాట్లాడుతూ “ఒకప్పుడు కాలుష్యరహితంగా ఉన్న ప్రాంతాలన్నీ నగరీకరణ ప్రభావంతో కాలుష్య ఖార్ఖానాలుగా మారిపోయాయి. కాలాలతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తుంది. మనం చూస్తుండగానే ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయి. ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే.. భవిష్యత్ తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. మనం ఎప్పుడో మేలుకొని చేయాల్సిన కార్యాన్ని నేడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన భుజాలమీద వేసుకున్నారు. దేశమంతా మొక్కలు నాటిస్తున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళుతున్న సంతోష్ కుమార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలంతా తమ బాధ్యతగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నాను” అని తెలిపారు.  అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సింగర్ శ్రేయాఘోషల్, ప్రముఖ వాయిద్యకారుడు శివమణికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

Also Read : గ్రీన్ ఇండియా చాలెంజ్ కు ప్రశంసలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్