కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం.. ఓటీటీకి టైమ్ రావడం.. తెలిసిందే. ట్రెండ్ మారుతుండడంతో స్టార్స్ కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓటీటీ మూవీ చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పానని, ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని ఇటీవల నాగార్జున తెలియచేశారు. అయితే.. ఆ స్టోరీ లైన్ ఏంటో..? ఆ సినిమాను తెరకెక్కించే దర్శకుడు ఎవరో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో పూర్తి వివరాలు తెలియచేస్తానన్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగచైతన్య కూడా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందేకు రెడీ అవుతున్నాడని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ చైతన్య ఓటీటీ ప్రాజెక్ట్ కోసం చాలా కథలను విని కొన్నింటిని ఫైనలైజ్ చేశారని తెలిసింది. అందులో ఓ కథకు చైతన్య ఓకే చెబితే చాలు.. ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేందుకు శరత్ మరార్ సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ‘థ్యాంక్యూ’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
నాగచైతన్య బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో నటిస్తున్నారు. త్వరలో ‘బంగార్రాజు’ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతారు. ఇది పూర్తయిన తర్వాత నాగచైతన్య ఓటీటీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందని టాక్ వినిపిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.