Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్IPL: Shardul Thakur: బెంగుళూరు బేజారు- కోల్ కతా గెలుపు

IPL: Shardul Thakur: బెంగుళూరు బేజారు- కోల్ కతా గెలుపు

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పై కోల్ కతా నైట్ రైడర్స్ 81 పరుగులతో ఘన విజయం సాధించింది.  కోల్ కతా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ తో సత్తా చాటి 29బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లతో 68 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. బౌలింగ్ లో ఒక వికెట్ కూడా తీసుకొని ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. కోల్ కతా 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేయగా… బెంగుళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో ఆర్చీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  26 పరుగుల వద్ద కోల్ కతా రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు (వెంకటేష్ అయ్యర్-3; మన్ దీప్ డకౌట్) కోల్పోయింది. నితీష్ రానా (1) విఫలం కాగా మరోసారి 89 పరుగుల వద్ద రెండు వికెట్లు (గుర్జాబ్-57; ఆండ్రీ రస్సెల్ డకౌట్)  పడ్డాయి. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శార్దూల్, రింకీ సింగ్ తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆరో వికెట్ కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రింకూ 33 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 46రన్స్ సాధించి 19వ ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు.

బెంగుళూరు బౌలర్లలో డేవిడ్ విల్లె, కర్ణ శర్మ చెరో 2; సిరాజ్, బ్రేస్ వెల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్య సాధనలో  బెంగళూరు తొలి వికెట్ కు 44 పరుగులు సాధించినా, రెండు పరుగుల తేడాతో ఓపెనర్లు ఇద్దరూ (విరాట్ కోహ్లీ-21; డూప్లేసిస్-23) ఔటయ్యారు. ఆ తర్వాత సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో జట్టు విఫలమైంది. డేవిడ్ విల్లె-20, బ్రేస్ విల్లె-19; ఆకాష్ దీప్- 17 పరుగులు మాత్రమే చేశారు.

కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4వికెట్లు సాధించగా, ఈ మ్యాచ్ లో ఐపీఎల్ లో ఆరంగ్రేటం చేసిన సుయాష్ శర్మ 3… సునీల్ నరైన్ 2; శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్