Monday, February 24, 2025
HomeTrending Newsపవన్ కు రాజారెడ్డి పెళ్లి పిలుపు

పవన్ కు రాజారెడ్డి పెళ్లి పిలుపు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు.  తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. నిన్న షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జాతీయ నాయకత్వం నియమించిన సంగతి తెలిసిందే.

ఏపీలో తెలుగుదేశం- జన సేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. బిజెపి కూడా ఈ కూటమితో కలుస్తుందా లేదా అనేది మరో వారం పదిరోజుల్లో తేలనుంది.

మరోవైపు ఈ నెల 22 తర్వాత షర్మిల పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించనున్నారు. దీనికి ముందు షర్మిల భారీ కాన్వాయ్ తో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్సార్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించి అనతరం విజయవాడ బయల్దేరి ఆంధ్రరత్న భవన్ లో పదవీ చేపడతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్