Monday, June 15, 2026
Homeస్పోర్ట్స్IND Vs. AFG: సెకండ్ సూపర్ లో ఇండియా విజయం

IND Vs. AFG: సెకండ్ సూపర్ లో ఇండియా విజయం

టి 20ల్లో మరో అద్భుత మ్యాచ్ కు బెంగుళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా నిలిచింది. ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో రెండో సూపర్ ఓవర్ లో ఇండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు బంతుల్లో ఒక పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీసి జట్టు గెలుపు ఖాయం చేశాడు.

మూడు టి-20ల సిరీస్ లో ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ లూ విజయం సాధించి సిరీస్ ను ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు జరిగిన ఆఖరి మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 22 పరుగులకే నాలుగు వికెట్లు (యశస్వి జైస్వాల్-4; కోహ్లీ డకౌట్; శివమ్ దూబే-1; సంజూ శామ్సన్ డకౌట్) కోల్పోయిన దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ- రింకూ సింగ్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి ధాటిగా ఆడారు. రోహిత్ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121; రింకూ 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది.  ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3; అజ్మతుల్లా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో దిగిన ఆఫ్ఘన్ తొలి వికెట్ కు 93 పరుగులు చేసింది. రహమతుల్లా 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. 1౦7 పరుగుల వద్ద ఇద్దరు బ్యాట్స్ మెన్ (ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్-50; అజ్మతుల్లా డకౌట్) ఔటయ్యారు. మొహమ్మద్ నబీ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులతో సత్తా చాటి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. చివరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావాల్సిన దశలో ముఖేష్ కుమార్ రెండు వైడ్స్ తో పాటు మొత్తం 18 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది. గుల్బడిన్ నయీబ్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చివరి ఓవర్లో  క్రీజులో నిలబడి 16 పరుగులు రాబట్టాడు.

తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లూ చెరో వికెట్ కోల్పోయి 16 పరుగులు చేశాయి. దీనితో రెండో సూపర్ ఓవర్ కు వెళ్ళాల్సి వచ్చింది. రెండో సూపర్ ఓవర్ లో తొలుత ఇండియా 2 వికెట్లకు 11 రన్స్ చేయగా, ఆఫ్ఘన్ మూడు బంతుల్లో  కేవలం ఒక్క పరుగు మాత్రమె చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో విజయం ఇండియాను  వరించింది.

రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్, శివమ్ దూబే కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular