Thursday, April 18, 2024
Homeసినిమావారితో నటించడం గర్వంగా ఉంది : హీరో శ‌ర్వానంద్

వారితో నటించడం గర్వంగా ఉంది : హీరో శ‌ర్వానంద్

Sharwa Happy: యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల ద‌ర్శ‌కుడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. టీజ‌ర్‌తోనే ఈ సినిమా మీద అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో మ‌రింత‌ మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మ‌ట్లాడుతూ “ఈ సినిమా నేను అనుకున్నంత హ్యాపీగా రావ‌డానికి కార‌ణ‌మైన సినిమాలో ఉన్న ఆడవాళ్లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా క‌థ చెప్పిన‌ప్పుడే అంద‌రూ పూర్తి స‌హాకారం అందిస్తేనే ఈ సినిమా బాగా వ‌స్తుంద‌ని న‌మ్మారు. శ‌ర్వా గారు ఈ సినిమా ఫ్లేవ‌ర్ ఎక్క‌డా మిస్ కాకుండా పూర్తి స‌హాకారం అందించారు. ర‌ష్మిక అంత బీజీ షెడ్యూల్‌లో ఉండి కూడా మేం ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జ‌స్ట్ చేసుకుని షూటింగ్‌కి వ‌చ్చింది.

కుష్బుగారి పాత్ర‌లో ఆమెను త‌ప్ప ఇంకెవ్వ‌రినీ ఊహించుకోలేము. రాధిక గారి లాంటి అనుభవం ఉన్న యాక్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌డం చాల హ్యాపీ. ఈ సినిమా మీకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. అంద‌రూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామీలీ అంతా క‌లిసి చూసే చిత్రమిది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌ అన్నారు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ “శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత మ‌ళ్లీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లు చేయ‌లేదు. అలాగే మ‌హానుభావుడు లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌మ‌ని చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాల్లో ఎలా న‌వ్వించాడో ఆ పాత శ‌ర్వా కావాల‌ని చాలా మంది అడుగుతున్నారు. వాళ్లంద‌రికీ ఒక‌టైతే ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను ఈ సినిమా చూసి వెళ్లేట‌ప్పుడు ఒక మంచి చిరున‌వ్వుతో, ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు. రాధిక గారు, కుష్బుగారి లాంటి యాక్ట‌ర్స్‌ తో క‌లిసి న‌టించ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు. ఇదొక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌. ర‌ష్మిక‌తో క‌లిసి న‌టించ‌డం చాలా స‌ర‌దాగా ఉంటుంది. చాలా డైడికేటెడ్ ప‌ర్స‌న్‌. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి గారికి థ్యాంక్స్‌. ముఖ్యంగా ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల ఇలాంటి ఒక బ‌ల‌మైన క‌థ‌కి ఆడ‌వాళ్లు మీకు జోహార్లు లాంటి టైటిల్ పెట్ట‌డం నిజంగా ప్ర‌శంస‌నీయం. ఇంత మంచి స్క్రిప్ట్ నా ద‌గ్గ‌ర‌కి తీసుకువ‌చ్చినందుకు ఆయ‌న‌కి ధ‌న్య‌వాదాలు. చాలా హ్యాపీగా సినిమా తీశాం. ఖ‌చ్చితంగా మీ అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు. రాధిక‌, ఖుష్బూ, ర‌ష్మిక‌, ఝాన్సీ త‌దిత‌రులు ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

Also Read : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం నుండి పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్