రజినీ, బిగ్ బి మూవీకి నో చెప్పిన నాని..?

రజినీకాంత్ ఆమధ్య నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. అయితే… ఈసారి పవర్ ఫుల్ స్టోరీతో వచ్చాడు. అదే.. జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. జైలర్ మూవీతో ఫామ్ లోకి వచ్చిన రజినీకాంత్ నెక్ట్స్ మూవీని జై భీమ్ డైరెక్టర్ జ్ఞాన వేల్ తో చేయనున్నారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో బిగ్ బి కీలక పాత్రలో నటింనున్నారు.

అమితాబ్, రజినీకాంత్ కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు 32 సంవత్సరాల తర్వాత అమితాబ్, రజినీ కలిసి నటిస్తుండడం విశేషం. అయితే.. ఇందులో ఓ యంగ్ హీరో క్యారెక్టర్ ఉందట. ఆ పాత్రలో నాని నటిస్తాడని వార్తలు వచ్చాయి. చిత్ర బృందం కూడా నానిని కాంటాక్ట్ చేశారట. రజినీ, అమితాబ్ మూవీ కాబట్టి నాని వెంటనే ఓకే చెబుతాడు అని ప్రచారం జరిగింది. కానీ.. నాని నో చెప్పాడట. అదేంటి ఇంత క్రేజీ మూవీలో అవకాశం వస్తే.. ఎవరైనా ఓకే చెబుతారు కదా.. నాని నో చెప్పడం ఏంటి అనుకుంటున్నారా..? ఇది విలన్ పాత్ర అట.

అందుకనే నాని నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. వి సినిమాలో నాని విలన్ గా నటించాడు. ఆ సినిమా ఆడలేదు. అప్పటి నుంచి విలన్ వేషాలు వేయకూడదు అనుకున్నాడట. ఇక నాని నో చెప్పడంతో ఆ పాత్ర యంగ్ హీరో శర్వానంద్ కు వెళ్లిందట. ఈ ఆఫర్ రాగానే మరో ఆలోచన లేకుండా శర్వా వెంటనే ఓకే చెప్పాడట. అమితాబ్, రజినీలతో నటించే అవకాశం రావడం శర్వాకు గోల్డన్ ఛాన్స్ అని చెప్పచ్చు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. లెజండరీ యాక్టర్స్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో శర్వా నటించడం నిజమైతే.. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు రావడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *