Saturday, January 18, 2025
Homeసినిమా‘మహా సముద్రం’ షూటింగ్ పూర్తి

‘మహా సముద్రం’ షూటింగ్ పూర్తి

‘ఆర్ఎక్స్-100’ తో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ యువ హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ కలసి నటిస్తున్న ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు, రావు రమేష్, జగపతి బాబు, గరుడ రామ్ తదితర నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా విజయంపై టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. చేతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్