Friday, March 13, 2026
Homeసినిమాబడ్జెట్ పెరిగినా… తగ్గేదేలే..

బడ్జెట్ పెరిగినా… తగ్గేదేలే..

శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహా సముద్రం’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏకే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా శర్వానంద్ మీద పెట్టే బడ్జెట్ కంటే ఎక్కువైనా, కథ మీద వున్న నమ్మకంతో అనిల్ సుంకర ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీపైన దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటి వరకు విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్, వర్కింగ్ స్టిల్స్ సినిమా పై వున్న అంచనాలను రెట్టింపు చేశాయి అని చెప్పచ్చు. స్వతహాగా అజయ్ భూపతి రాంగోపాల్ వర్మ శిష్యుడు కావడంతో పోస్టర్ మేకింగ్ నుంచి సినిమాను ప్రమోట్ చెయ్యడానికి తన గురువు స్ట్రాటజీలనే వాడుతున్నట్టు వుంది అని యూనిట్ వర్గాలు అంటున్నాయి.

అన్ని పనులు పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయవచ్చు అనే ప్లానింగ్ లో యూనిట్ వున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ తో పాటు ఈ చిత్రంలో అను ఎమ్యానూల్, అదితిరావ్ హైదరి నటిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ఆచితూచి కథలను ఓకే చేస్తున్నారు. ఆర్ఎక్స్ 100 చిన్న సినిమాతో హిట్ కొట్టి ట్యాలెంట్ బయట పెట్టిన అజయ్ భూపతి కథ నచ్చే శర్వానంద్  ఓకే చేశారని, ఈ కథ శర్వాకు చాలా బాగా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular