Tuesday, April 16, 2024
HomeTrending Newsథర్డ్‌ వేవ్‌ పై అప్రమత్తం : సిఎం

థర్డ్‌ వేవ్‌ పై అప్రమత్తం : సిఎం

థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు.  పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని నిర్దేశించారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్‌ సూచించిన అంశాలు:

  • కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
  • పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి
  • సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలి
  • అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు
  • కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలి
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు
  • కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలి
  • జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయి
RELATED ARTICLES

Most Popular

న్యూస్