ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. 2021 మార్చిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో పాల్గొన్న జట్టులో మెజారిటీ ఆటగాళ్లకు ఈ సీరీస్ లో కూడా అవకాశం కల్పించారు. శ్రీలంకతో సిరీస్ ను 3-0తో వెస్టిండీస్ క్వీన్ స్లీప్ చేసింది. ఆ జట్టులో చోటు దక్కని హెట్మెయిర్, షెల్డన్ కట్రెల్ లను అస్త్రేలియా సిరీస్ కు ఎంపిక చేశారు.
జూలై 20,22, 24 తేదీల్లో జరిగే ఈ మూడు మ్యాచ్ లు వెస్టిండీస్ బార్బొడాస్ లోని కెన్సింగ్టన్ స్టేడియం లోనే జరగనున్నాయి. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ లో వాతావరణ పరిస్థితులు, పిచ్ అలవాటు ఉండడంతో ఆటగాళ్ళు తమదైన అత్యుత్తమ ప్రదర్శనతో రాణించి విజయం సాధిస్తారని వెస్టిండీస్ సెలక్షన్ కమిటి చైర్మన్ రోజర్ హార్పర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్, టి-20 సిరీస్ లను వెస్టిండీస్ కోల్పోయిన సంగతి తెలిసింది. మూడు టెస్టుల సీరీస్ ను 3-0 తేడాతో, టి-20 సిరీస్ ను 3-2 తో కోల్పోయింది. ఆస్ట్రేలియా తో ఐదు టి20, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. వన్డే, టి 20 జట్లకు వేర్వేరు జట్లను ప్రకటించింది వెస్టిండీస్.
టి-20 జట్టులో క్రిస్ గేల్ కు చోటు దక్కింది. టి-20 మ్యాచ్ లు జూలై 9,10,12, 14, 16 తేదీల్లో సెయింట్ లూసియా గ్రౌండ్లో జరగనున్నాయి.
వెస్టిండీస్ కు చెందిన ఆటగాళ్ళు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వివిధ జట్లకు ఆడుతూ భారత క్రికెట్ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు