Monday, June 8, 2026
Homeసినిమాగ్రీన్ఇండియా చాలెంజ్ లో షిర్లీ

గ్రీన్ఇండియా చాలెంజ్ లో షిర్లీ

న్యూజిలాండ్ గాయని, హీరోయిన్ షిర్లీ సేటియా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటింది. నాగ శౌర్య కథానాయకుడిగా రూపొందిన కృష్ణ వ్రింద విహారి సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఓ పాట పాడి తెలుగు భాష, ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసింది.

షిర్లీ సేటియా మాట్లాడుతూ “గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉంది. తెలంగాణ లో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉంది , ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు” అంటూ తన సంతోషం వ్యక్తం చేసింది. విక్టరీ వెంకటేష్, శిల్పా శెట్టి, రాజ్ కుమార్ రావు, అభిమన్యు ఈ నలుగురికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది షిర్లీ . అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ… ఎంపీ సంతోష్ కుమార్ గారి వృక్ష వేదం పుస్తకాన్ని షిర్లీ సేటియా కి అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular