Saturday, June 6, 2026
Homeసినిమాఅమెజాన్ ప్రైమ్ కి వచ్చేసిన 'శివమ్ భజే'

అమెజాన్ ప్రైమ్ కి వచ్చేసిన ‘శివమ్ భజే’

అశ్విన్ బాబు హీరోగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను .. డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అలాంటి అశ్విన్ బాబు తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు ‘శివం భజే’ వచ్చింది. ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

అశ్విన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా దిగాంగన సూర్యవన్షి అలరించింది. అర్బాజ్ ఖాన్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, మురళీ శర్మ .. తులసి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అప్సర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి వికాస్ సంగీతాన్ని సమకూర్చాడు. థియేటర్లలో నిలబడలేకపోయిన ఈ సినిమా, ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ తో పాటు ‘ఆహా’ లోను స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ కథలో అశ్విన్ బాబు .. చందూ పాత్రలో కనిపిస్తాడు. అతను లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ ఉంటాడు. శైలజ అనే అమ్మయితే అతను ప్రేమలో పడతాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటున్న అతనికి, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన చూపు పోతుంది. ఆ తరువాత అతనికి వేరే వ్యక్తి కళ్లను అమర్చుతారు. అప్పటి నుంచి అతనికి ఏవేవో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular