Tuesday, June 16, 2026
Homeసినిమాడా. శివరాజ్ కుమార్ '#ShivannaSCFC01' అనౌన్స్ మెంట్

డా. శివరాజ్ కుమార్ ‘#ShivannaSCFC01’ అనౌన్స్ మెంట్

డా. శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న తెలుగు నిర్మాతతో ఓ కొత్త చిత్రానికి సైన్ చేశారు. శివన్న పుట్టినరోజున సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఎస్‌సిఎఫ్‌సి (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ) తొలి కన్నడ చిత్రంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు.

‘#ShivannaSCFC01’ భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనుంది. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. డా. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతుందని సూచిస్తోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో శివన్నస్పోర్టింగ్ షేడ్స్ ధరించి టెర్రిఫిక్ గా కనిపించారు. ‘’Night has fallen let the killing begin!’’ అని పోస్టర్ పై రాయడం క్యురియాసిటీని పెంచుతోంది.మేకర్స్ అన్ని దక్షిణాది భాషల నుండి ప్రముఖ నటీనటులని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పాన్ సౌత్ ఇండియా కన్నడ, తెలుగు, తమిళం , మలయాళ భాషల్లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular