Friday, March 20, 2026
Homeసినిమాశివరాజ్ కుమార్ 'ఘోస్ట్' అక్టోబర్ 19న విడుదల

శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ అక్టోబర్ 19న విడుదల

డా.శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ ఆకట్టుకునే పోస్టర్ తో అనౌన్స్ చేశారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న రిలీజ్ పోస్టర్ ఘోస్ట్ ఆగమనాన్ని ప్రకటిస్తోంది. పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ ‘When Shadows Speak… Know The Ghost Is Arriving’ అంచనాలు మరింత పెంచేలా ఉంది. ఘోస్ట్ నుండి వచ్చిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, బిగ్ డాడీ టీజర్ ల తర్వాత అతు ట్రేడ్ లోనూ ఇటు ప్రేక్షకుల్లో చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

తమ భాషల్లో ఘోస్ట్ రైట్స్ కోసం పెద్ద పెద్ద బ్యానర్ ల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. చిత్ర బృందం అక్టోబర్ రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ అక్టోబర్ 19న దసరా కు ప్రేక్షకుల ముందుకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular