Monday, January 20, 2025
HomeTrending Newsజగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ బోగ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ బోగ శ్రావణి రాజీనామా

జగిత్యాల మున్సిపాల్ ఛైర్మన్ బోగ శ్రావణి ప్రవీణ్ అనూహ్యంగా ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు అవిశ్వాసం పెడతామని బెదిరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ కూడా ఇచ్చారు. కానీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో అవిశ్వాసాలు కూడదని అధిష్టానం వారించింది. ఇదంతా టీ కప్పులో తూఫానులా సమసిపోయిందని పార్టీ నేతలు, శ్రేణులు అనుకున్నారు.
కానీ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ రోజు బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా సమావేశం పెట్టి మరి ప్రకటించడంతో పార్టీ వర్గాలు నివ్వెర పోతున్నాయి.

జగిత్యాలలో రాబోయే ఎన్నికల్లో గులాబీ దండును ఎదుర్కునేందుకు కాంగ్రెస్ నేతలు సమాయాత్తం అవుతుండగా…. కారు పార్టీ నేతల కారు కూతలతో పార్టీ పరిస్థితి దిగజారుతోంది. పార్టీలో గ్రూపులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని… గలాబీ నేతలే గుస గుస లాడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్