Monday, June 15, 2026
Homeసినిమారామ్ 'స్కంద' చిత్రీకరణ పూర్తి

రామ్ ‘స్కంద’ చిత్రీకరణ పూర్తి

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ చిత్రం. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో చూపిస్తున్నారు. ఇదిలాఉండగా మాసీవ్ సెట్‌లో లీడ్ పెయిర్, డ్యాన్సర్‌లపై చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలో రామ్, శ్రీలీల.. బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి ఫ్యాన్సీ దుస్తులలో కనిపించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

టీజర్, టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించగా, ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు… చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్ థమన్ స్వరపరిచిన ఈ పాట అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. ఈ పాటలో రామ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular