Friday, June 12, 2026
Homeసినిమాకుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం ‘బుట్ట బొమ్మ’- దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం ‘బుట్ట బొమ్మ’- దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ తో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమయ్యారు. నేడు(ఫిబ్రవరి 4న) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ.. “మా సినిమాకు ఇంత మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. సినిమా బాగుందని యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది లవ్ స్టోరీ నుంచి థ్రిల్లర్ గా మారే కథ అయినప్పటికీ.. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. మీ కుటుంబంతో కలిసి వెళ్ళండి.. ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రి తన కూతురితో కలిసి చూడాల్సిన సినిమా. మనం పిల్లలతో చెప్పలేని కొన్ని విషయాలను.. ఈ సినిమా చూపించి వారికి సులభంగా అర్థమయ్యేలా చేయొచ్చు. థియేటర్ కి వెళ్లి చూడండి.. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి మీకు కలుగుతుంది. రోజురోజుకి ఈ సినిమా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular