Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

ఎన్టీఆర్ మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ మూవీ రానుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కి పూర్తవుతుంది. ఆతర్వాత బాలీవుడ్ మూవీ వార్ 2 లో నటించనున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండ్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనేది ప్లాన్. వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ కానుందని సమాచారం.

అయితే… ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటించనున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. ఇప్పుడు బాలీవుడ్ మరో బ్యూటీ శ్రద్ధా కఫూర్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. అందుచేత నటీనటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ చేయలేదు. కాకపోతే ప్రశాంత్ నీల్ రాసిన కథలో కథానాయిక పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని.. ఆ పాత్రకు శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.

ఇక కథ విషయానికి వస్తే.. ఇది ఇండియా పాకిస్థాన్ బోర్డర్ నేపధ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు చూపించని విధంగా.. చాలా పవర్ ఫుల్ గా చూపించేలా కథను డిజైన్ చేశారని తెలిసింది. ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నప్పటికీ అంతకు మించి అనేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. పైగా ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే అభిమానం. అందుచేత ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో చూపించబోతున్నారని అభిమానులు చాలా అంచనాలతో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్