రాజ్యసభలో సభాపక్ష నేత, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ కర్నాటక గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన గెహ్లాట్ భారతీయ జనతా పార్టీలో, కేంద్ర ప్రభుత్వాల్లో పలు హోదాల్లో పనిచేశారు.
8 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ నిర్ణయం తీసుకున్నారు, ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.
- గోవా గవర్నర్ గా ప్రస్తుత మిజోరాం గవర్నర్ గా ఉన్న శ్రీధరన్ పిళ్ళై
- త్రిపుర గవర్నర్ గా ప్రస్తుత హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య
- హర్యానా గవర్నర్ గా ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- జార్ఖండ్ గవర్నర్ గా ప్రస్తుత త్రిపుర గవర్నర్ రమేష్ బయాస్
- మిజోరాం గవర్నర్ గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కంభంపాటి హరిబాబు
- కర్నాటక గవర్నర్ గా తావర్ చంద్ గెహ్లాట్
- మధ్య ప్రదేశ్ గవర్నర్ గా మంగు భాయి ఛగన్ భాయి పటేల్
- హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ లను నియమిస్తూ రాష్ట్ర పతి నిర్ణయం తీసుకున్నారు.