Friday, April 19, 2024
Homeసినిమాస‌లార్ నుంచి శృతిహాస‌న్ బ‌ర్త్ డే పోస్ట‌ర్

స‌లార్ నుంచి శృతిహాస‌న్ బ‌ర్త్ డే పోస్ట‌ర్

Shruti as Aadya: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స‌లార్’. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ యాక్ష‌న్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. ఇందులో ప్ర‌భాస్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని.. ఈ రెండు పాత్ర‌లు చాలా వైవిధ్యంగా.. చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఈ యాక్ష‌న్ మూవీ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ రోజు క‌థానాయిక‌ శృతి హాసన్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా స‌లార్ మూవీ నుంచి శృతిహాస‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. దీనితో పాటుగా ఈమె పాత్ర పేరేంటో కూడా తెలియజేసారు. ఇంత‌కీ.. స‌లార్ మూవీలో శృతిహాస‌న్ పాత్ర పేరు ఏంటంటే.. ఆద్య. ఆమె లుక్ చాలా సింపుల్ గా కనిపిస్తుంది. మరి సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో అనేది ఆస‌క్తిగా మారింది. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీని హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్