Saturday, January 18, 2025
Homeసినిమాగోపీచంద్ కి ‘శృతి’ సెంటిమెంట్!

గోపీచంద్ కి ‘శృతి’ సెంటిమెంట్!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన గోపీచంద్ మలినేని ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా చాలా మంది సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. అదే ఇండస్ట్రీలో జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్లు కాస్త ఎక్కువుగానే ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్ మలినేని గోపీచంద్ కూడా బాలయ్య సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలిసింది. ఇంతకీ.. ఏంటా సెంటిమెంట్ అంటారా..?

బలుపు సినిమాతో మలినేని గోపీచంద్ దర్శకుడు అయ్యారు. ఈ సినిమాలో కథానాయిక శృతిహాసన్. ఆ సినిమా సక్సస్ అయ్యింది. సంక్రాంతికి క్రాక్ మూవీ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ సరసన శృతిహాసన్ నటించింది. ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో శృతిహాసన్ తనకు బాగా కలిసొచ్చింది అనుకున్న గోపీచంద్ తదుపరి చిత్రంలో బాలయ్య సరసన నటించేందుకు శృతిహాసన్ నే ఎంపిక చేశారని తెలిసింది. మరో విషయం ఏంటంటే..

ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఒక పాత్ర పోలీస్ అయితే.. మరో పాత్ర ఫ్యాక్షనిస్ట్ అని.. ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి అంటున్నారు.

బాలయ్య – శృతిహాసన్ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది. అయితే.. ఇందులో మరో కథానాయిక కూడా ఉంటుందట. కాకపోతే ఇంకా ఎవర్నీ ఫిక్స్ చేయలేదని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కరోనా తగ్గిన తర్వాత ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందో ప్రకటించనున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్