ఇండియా –ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ నేడు ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో మొదలైంది. టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా లో రెండు మార్పులు చేశారు. కొంతకాలంగా విఫలమవుతోన్న ఓపెనర్ కెఎల్ రాహుల్ పై వేటు వేసి అతని స్థానంలో శుభ్ మన్ గిల్ ను తీసుకున్నారు. పేస్ బౌలర్ మహమ్మద్ షమికి విశ్రాంతి ఇచ్చి ఉమేష్ యాదవ్ కు అవకాశం కల్పించారు.
నాలుగు టెస్టులు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. నాగపూర్, ఢిల్లీల్లో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో ఇండియా ఘన విజయం సాధించి 2-0ఆధిక్యంలో ఉంది.
ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఇండియా అర్హత సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కాగా, డేవిడ్ వార్నర్ రెండో టెస్టులో గాయంతో మిగిలిన సిరీస్ కు దూరమయ్యాడు. కెప్టెన్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్ళాడు. అతని స్థానంలో స్టీవెన్ స్మిత్ సారధ్యం వహిస్తున్నాడు. కమ్మిన్స్ స్థానంలో మిచెల్ స్టార్క్, వార్నర్ బదులు కామెరూన్ గ్రీన్ ను జట్టులోకి తీసుకున్నారు.