Sunday, March 15, 2026
Homeసినిమాశ్యామ్ సింగ‌రాయ్ బ్లాక్ బ‌స్టర్ క్లాసిక్ సెల‌బ్రేష‌న్స్

శ్యామ్ సింగ‌రాయ్ బ్లాక్ బ‌స్టర్ క్లాసిక్ సెల‌బ్రేష‌న్స్

Blockbuster Classic Celebrations: న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. విభిన్నక‌థాచిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇందులో నాని స‌ర‌స‌న‌ సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. క్రిస్మస్ కానుక‌గా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. తెలుగులోనే కాకుండా.. త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా శ్యామ్ సింగ‌రాయ్ బ్లాక్ బ‌స్టర్ క్లాసిక్ సెల‌బ్రేష‌న్స్ ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేచుర‌ల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్‌, నిర్మాత వెంక‌ట్‌బోయ‌న‌పల్లి చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు షీల్డ్‌ లు అందించారు.

Also Read : ‘శ్యామ్ సింగ రాయ్’కు ప్రేక్షకుల ఆదరణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular