Wednesday, June 10, 2026
Homeసినిమా‘శ్యామ్ సింగ రాయ్’కు ప్రేక్షకుల ఆదరణ

‘శ్యామ్ సింగ రాయ్’కు ప్రేక్షకుల ఆదరణ

record collections: నేచురల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ సినిమాపై నాని మొదటినుంచీ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఆ న‌మ్మ‌క‌మే నిజం అయ్యింది. విడుద‌లైన అన్ని ఏరియాల్లో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది.

యుఎస్ లో శ్యామ్ సింగ రాయ్ హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా శ్యామ్ సింగ రాయ్ రూపొందింది. సినిమాకి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. క్రిస్మ‌స్ హాలీడే బాగా క‌లిసొచ్చింది. అలాగే న్యూ ఇయర్ హాలీడేస్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవ‌కాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : నాకు ఆ ఆలోచన లేదు : హీరోయిన్ కృతి శెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular