Sunday, June 7, 2026
Homeసినిమావరంగల్‌లో 14న ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్

వరంగల్‌లో 14న ‘శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్

Royal Even of Shyam Singha Roy:
న్యాచులర్ స్టార్ నాని ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి వస్తున్న ప్రతీ అప్ డేట్ ఆసక్తిని కలిగిస్తూ వస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్  పై  ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి.

ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది. తాజాగా శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌ వరంగల్‌లోని రంగలీల మైదానంలో జరుపుతున్నట్లు యూనిట్ ప్రకటించింది. నానితో పాటు చిత్రయూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : ‘శ్యామ్ సింగ రాయ్’ లో సిరివెన్నెల చివరి పాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular