Monday, March 16, 2026
Homeసినిమాసిద్ధార్థ్ 'టక్కర్' చిత్రం నుంచి 'రెయిన్ బో' పాట విడుదల

సిద్ధార్థ్ ‘టక్కర్’ చిత్రం నుంచి ‘రెయిన్ బో’ పాట విడుదల

హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్న సిద్ధార్థ్, ఈ చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’, ‘ఊపిరే’ పాటలు విశేష ఆదరణ పొందాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘రెయిన్ బో’ అనే పాట విడుదలైంది.

‘టక్కర్’ నుంచి ‘రెయిన్ బో’ అనే నాలుగో పాటను ఈరోజు(జూన్ 2) సాయంత్రం 4 గంటలకు విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. ‘కయ్యాలే’ ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసి సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మేకర్స్.. ‘రెయిన్ బో’ సాంగ్ కూడా ఫుల్ వీడియో విడుదల చేసి ఆ ట్రెండ్ ని కొనసాగించారు. నాయకానాయికలు కారులో వెళ్తూ, దారిలో కలిసిన వారితో సరదాగా గడుపుతున్నట్లుగా పాట చిత్రీకరణ సాగింది. నివాస్ కె ప్రసన్న మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. సంగీతానికి తగ్గట్లుగా సిద్ధార్థ్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. “రెయిన్ బో చివరే ఒక వర్ణం చేరెలే” అంటూ కృష్ణకాంత్ పాటను ఎత్తుకోవడమే కొత్తగా ఎత్తుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular