Thursday, April 18, 2024
Homeసినిమా'టక్కర్' యూనిక్ లవ్ స్టోరీ సినిమా – సిద్దార్థ్

‘టక్కర్’ యూనిక్ లవ్ స్టోరీ సినిమా – సిద్దార్థ్

సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ వివరాల్లోకి వెళితే….

హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ….నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నాను అని చెప్పాడు.
పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అన్నారు. తదనంతరం పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్