Sunday, February 23, 2025
Homeసినిమాజనవరి 14 న సిద్దు జొన్నలగడ్డ 'డిజె టిల్లు'

జనవరి 14 న సిద్దు జొన్నలగడ్డ ‘డిజె టిల్లు’

DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదలవుతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈ రోజు విడుదల చేసింది. నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే ‘డిజె టిల్లు’ లవ్ బాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమాగా కనిపిస్తోంది.

ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుంది. అందులోని దృశ్యాలు, సంభాషణలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. విమల్ కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్