Friday, March 29, 2024
Homeసినిమా‘డియర్ మేఘ’ కోసం సిధ్ శ్రీరామ్ 'బాగుంది ఈ కాలమే'......

‘డియర్ మేఘ’ కోసం సిధ్ శ్రీరామ్ ‘బాగుంది ఈ కాలమే’……

మ్యూజికల్ హిట్ దిశగా ‘డియర్ మేఘ’ అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల ‘ఆమని ఉంటే పక్కన’ పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా…తాజాగా సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘బాగుంది ఈ కాలమే’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. ‘బాగుంది ఈ కాలమే’ పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.

‘ఊరికే ఇంత కాలం ఉంటున్నా…ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా…ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే పోయెనా, వేదనే తీరెనా…బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..’అంటూ అమేజింగ్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణకాంత్ ఈ పాటను రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.

”డియర్ మేఘ” చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ  సినిమాను రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్