అమెరికాలో అపహరణకు గురైన భారతీయ కుటుంబాన్ని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. సిక్కు కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వారంతా భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. మెర్సిడ్ కౌంటీ శివార్లలో వారి మృతదేహాలు లభ్యం అయ్యాయని పోలీసులు తెలిపారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు.. ఎందుకు చేశారానే దిశగా విచారణ సాగోతోందన్నారు. అయితే మృతులకు సంబంధించిన ఎటిఎం కార్డును అత్వటర్ (ATWATER) నగరంలో వాడినట్టు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందింది. తెలిసినవారే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు.
కాలిఫోర్నియాలో మెర్సిడ్ కౌంటీలో ఓ భారత సంతతి కుటుంబం సోమవారం అపహరణకు గురైంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీలో జస్దీప్ సింగ్ (36), జస్లీన్ కౌర్ (27) వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరిని, మరో అమన్‌దీప్ సింగ్‌ను (39) కిడ్నాపర్లు తీసుకెళ్లినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.నిందితుడు ఆయుధాలు కలిగి ఉన్నాడని, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని పోలీసు కార్యాలయం పేర్కొంది. కిడ్నాప్‌కి గురైన వారికి దక్షిణ హైవే 59లోని 800 బ్లాక్ వద్ద ఉన్న స్థలం వ్యాపారం కోసం కబ్జా చేసినట్టు ఆరోపణలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఆ స్థలం చిల్లర వ్యాపారులు, రెస్టారెంట్లతో కూడిన రహదారి అన్నారు.