Friday, September 20, 2024
HomeTrending Newskhalistan : మన పంజాబ్ పైనే ఖలిస్తానీల గురి ?

khalistan : మన పంజాబ్ పైనే ఖలిస్తానీల గురి ?

కెనడా సిక్కుల్లో వేర్పాటువాదం వెనుక పాకిస్థాన్ గూడచార సంస్థ ఐఎస్ ఐ ఉంది అనేది జగమెరిగిన సత్యం. కెనడాలో స్థిరపడ్డ సిక్కుల్లో రెండో తరం వారు ఎక్కువగా ఖలిస్తాన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. స్వాతంత్రానికి పూర్వమే భారత్ నుంచి సిక్కులు ఉపాధి కోసం వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఓ కొత్త సంప్రదాయం మొదలు పెట్టారు.

కెనడా జాతీయులు(పౌరులు) పెళ్లి సంబందాల కోసం పంజాబ్ వచ్చేవారు. ఇక్కడ పంజాబీ అమ్మాయిలు, అబ్బాయిలతో పెళ్లి చూపులు… వారి రాకపోకలు, ఆతిథ్యం తదితర వ్యవహారాలు సిక్కులే చూసేవారు. మొదట సిక్కు అమ్మాయిని పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆమె అన్నదమ్ములు… ఇతర కుటుంబ సభ్యులను కెనడా తీసుకెళ్లటం జరిగేది. ఈ వ్యవహారం 1990లలో ఎక్కువగా జరిగింది. కాల క్రమంలో ఇందుకోసం ప్రత్యేకంగా మ్యారేజ్ బ్యూరోలో కూడా వచ్చాయి.

ఈ విధంగా సిక్కుల వలసలు పెరిగాయి. ఈ రోజు కెనడా జనాభాలో రెండు శాతంగా ఉన్న సర్దార్జీల జనాభా పది లక్షలు దాటేసింది. పక్కన అమెరికాలో ఐదు లక్షల పైచిలుకు వరకు ఉంటారు. మొదట ఉపాధి కోసం వెళ్ళిన సిక్కులు ఆర్థికంగా స్థిరపడగానే ఖలిస్తాన్ ఏర్పాటు అంశం తెరమీదకు తీసుకొచ్చారు.

కాశ్మీర్, ఖలిస్తాన్, బలూచిస్తాన్ వేర్పాటువాదులు, తమిళ ఈలం సానుభూతిపరులు ఇలా ప్రపంచంలో తీవ్రవాద ఉద్యమాల్లో పాల్గోనేవారందరికి కెనడా.. పశ్చిమ దేశాలు ఆశ్రయం ఇస్తాయి. ఇందుకు మానవ హక్కులు అని భాష్యం చెపుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు అదే పని చేస్తే ప్రపంచానికే శత్రువుగా చిత్రీకరిస్తారు.

ఖలిస్తానీలు..ఇస్లామిక్ ఉగ్రవాదుల మధ్య బంధం బలంగా ఉంది. రెండు వర్గాల మధ్య సాంస్కృతిక సామ్యత ఉంటుంది. సూఫీ సిద్దాంతాన్ని రెండు వర్గాల వారు పాటిస్తారు. సిక్కు, ఉర్దూ సాహిత్యానికి పాకిస్థాన్ పంజాబ్… భారత్ పంజాబ్ లలో బహుళ జనాదరణ ఉంది.

సిక్కు పవిత్ర స్థలాలు భారత్ కన్నా పాకిస్థాన్ లోనే ప్రముఖమైనవి ఉన్నాయి. సిక్కు మొదటి గురువు గురునానక్ జన్మస్థలం నాన్ ఖాన లాహోర్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని ఇదే నాన్ ఖానా సాహెబ్ గురుద్వారగా ప్రసిద్దికెక్కింది. భారత సరిహద్దుల్లోని ఖర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాలో గురునానక్ ప్రబోధనలు చేస్తూ జీవిత చరమాంకం వరకు ఇక్కడే గడిపారు.

ఇంకా అనేకమైన సిక్కు పవిత్ర స్థలాలు పాకిస్థాన్ లో ఉన్నాయి. పాకిస్థాన్ లోని పంజాబ్ నే ఖలిస్తాన్ గా ఏర్పాటు చేసేందుకు ఉద్యమించవచ్చు. అయితే ఇస్లామిక్ అతివాదులు సిక్కు గురుద్వారాలకు నష్టం కలిగిస్తే పూడ్చుకోలేమని…భారత్ లౌకికవాదం..ప్రజల మత సహనం దృష్ట్యా ఇక్కడి పంజాబ్ లో అల్లర్లు సృష్టిస్తున్నారు.

వేర్పాటువాద సిక్కు సంస్థ విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కేవలం పంజాబ్ మాత్రమే కాకుండా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలు ఖలిస్తాన్ స్థాపన కోసం భారతదేశం నుండి వేరు చేయబడే ప్రాంతాలుగా సిఖ్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ చూపించింది.

కెనడా సిక్కు ఉగ్రమూకల్లో పాక్ సిక్కులు హింసతోనే సాధ్యం అని ప్రేరిపిస్తున్నారు. ఇందుకు భారత్ నుంచి వెళ్ళిన వారు పాత్రధారులు అవుతున్నారు. వీళ్ళకు లోపాయికారిగా ఇ.ఎస్.ఐ ఇతర ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులు సహకరిస్తున్నాయి. ఇది ఎలా ఉంటె దేశంలో ఎంతో మంది దేశభక్తులు సిక్కుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ సున్నితంగా వ్యవహరించి…ఖలిస్తానీలకు అడ్డుకట్ట వేయాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్