బ్యాడ్మింటన్ వియత్నాం ఓపెన్ -2022, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్ళు సిక్కీ రెడ్డి – రోహన్ కపూర్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. మలేషియా జంట చాన్ పెంగ్ సూన్- చ్యే ఈ సి పై 21-19; 21-17 తేడాతో విజయం సాధించి టైటిల్ రేస్ లో నిలిచారు.
బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సూపర్ 100 సిరీస్ లో భాగంగా జరుగుతోన్న టోర్నమెంట్ లో ఇండియా నుంచి ఈ ఒక్క జంట మాత్రమే క్వార్టర్స్ దాటారు.
రేపు జరిగే సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో వీరు ఇండోనేషియా ద్వయంతో తలపడనున్నారు.