Saturday, November 23, 2024
HomeTrending Newsప్రతి మహిళ వద్ద ‘దిశా’ యాప్ : సింధు

ప్రతి మహిళ వద్ద ‘దిశా’ యాప్ : సింధు

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి మహిళ తమ మొబైల్ లో ‘దిశ’ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత పి వి.సింధు పిలుపునిచ్చారు. నేడు విజయవాడలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి సింధు, తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి వచ్చారు. డిజిపి గౌతమ్ సావాంగ్ వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. సింధు తో పాటు ఆమె తల్లిదండ్రులను డిజిపి సత్కరించారు.

టోక్యో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తాను సాధించిన కాంస్య పతకాన్ని ఆమె డిజిపికి చూపించారు, ఆ పతకాన్ని అయన ఆసక్తిగా తిలకించి ఆమెను అభినందించారు. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయి లో పతకం సాధించడం ఆంధ్ర ప్రదేశ్ కు దక్కిన గౌరవంగా అయన అభివర్ణించారు. ఈ విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి ఇస్తుందని అయన విశ్వాసం వ్యక్తం చేశారు.  రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింప జేయాలని డిజిపి సావంగ్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. దిశా యాప్ పనితీరును తెలుసుకున్న సింధు ఈ యాప్ రూపకల్పనపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్