పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గబాటి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి తెలుగు రీమేక్ ఇది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ సినిమా అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానుల కోసం అదిరిపోయే అప్‌డేట్‌ అందించింది చిత్ర యూనిట్‌.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 15న ఉదయం 9.45గంటలకు ఈ చిత్ర టైటిల్‌, పవన్‌ కళ్యాణ్ పాత్రకి సంబంధించి గింప్స్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌.. పోలీసాఫీసర్ భీమ్లానాయక్‌గా కనిపించనున్నారు. పవన్ సరసన నిత్య మీనన్‌ నటిస్తుంటే.. రానా దగ్గుబాటి సరసన ఐశ్యర్య రాజేశ్‌ నటిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *