Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్England Open: గాయత్రి-జాలీ జోడి గెలుపు, సింధు ఔట్

England Open: గాయత్రి-జాలీ జోడి గెలుపు, సింధు ఔట్

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2023 తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్ లో చైనా ప్లేయర్ ఝాంగ్ ఇ మాన్ చేతిలో 21-17; 21-11 తేడాతో పరాజయం చెంది నిష్క్రమించింది.

ఇండియాకు చెందిన ఇతర ఆటగాళ్ళ విషయానికి వస్తే….

పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్ 19-21; 21-14; 21-5తో ఫ్రెంచ్ ఆటగాడు తోమా జూనియర్ పోపోవ్ పై గెలుపొందాడు. తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత తేరుకొని… రెండు వరుస సెట్లలో శ్రీకాంత్ పైచేయి సాధించి గెలుపు సొంతం చేసుకున్నాడు.

మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ ద్వయం 21-18; 21-14తో థాయ్ లాండ్ జోడీపై గెలుపొందారు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-13;21-13తో మన దేశానికే చెందిన కృష్ణ ప్రసాద్- విష్ణు వర్ధన్ గౌడ్ లపై విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్