Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఇండోనేషియా మాస్టర్స్: సింధు, లక్ష్య సేన్ విజయం

ఇండోనేషియా మాస్టర్స్: సింధు, లక్ష్య సేన్ విజయం

Sindhu-Sen: ఇండోనేషియా మాస్టర్స్-2022 టోర్నమెంట్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, లక్ష్య సేన్ లు మొదటి రౌండ్ లో విజయం సాధించారు. అయితే మిగిలిన ఆటగాళ్ళు విఫలమయ్యారు.

మహిళల సింగిల్స్ లో సింధు డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టో ఫియర్సన్ పై 18-21; 21-15;21-11 తేడాతో విజయం సాధించింది. మొదటి సెట్ కోల్పోయిన సింధు ఆ తర్వాత తనదైన షాట్లతో ఎదురు దాడి చేసి విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ కూడా డెన్మార్క్ ఆటగాడు సోల్ బెర్గ్ విట్టింగస్ పై 21-10; 21-18తో విజయం సొంతం చేసుకున్నాడు.

మహిళల సింగిల్స్ లో ఆకర్షి కాశ్యప్, పురుషుల సింగిల్స్ లో సమీర్ వర్మ; మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్-తానీషా క్రాస్టో జోడీ తమ ప్రత్యర్ధుల చేతిలో పరాజయం పాలయ్యారు. సుమీత్ రెడ్డి- అశ్వని పొన్నప్ప జంట ఆడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్